కత్తి మహేష్ నోట శ్రీరాముడి పాట - G News Telugu - 0 views
-
gnewstelugu on 12 Jul 18కత్తి మహేష్ ఇటీవల శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కత్తి మహేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తడంతో కత్తి మహేష్‌పై పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయన్ను ఏపీకి తరలించారు. మా అనుమతి లేకుండా హైదరాబాద్‌లో అడుగుపెట్టరాదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే శ్రీరాముడిని దూషించిన నోటితోనే ఆయనను పొగుడుతూ శ్లోకాలతో కూడిన ఓ పాటను కత్తి మహేష్ పాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కత్తి మహేష్ రాముడి పాటను పాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే కత్తి నోట ఈ శ్లోకం రావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. శ్రీరాముడికి తాను వ్యతిరేకం కాదని చెప్తున్నాడా..? పశ్చాత్తాపంతో రాముడిని స్మరించుకుంటున్నాడా? భ